
జ్యోతిష్య శాస్త్రంలో శకున శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే దీని ప్రకారం అర చేతుల్లో దురద పెట్టడం కూడా భవిష్యత్తు సూచనలు తెలియజేస్తుంది. అంతే కాకుండా మంచి చెడుల గురించి తెలియజేస్తుంది. అయితే ఇది స్త్రీ పరుషులలో వేర్వేరుగా ఉంటుంది. కాగా, మనం ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం.

చాలా మంది స్త్రీలు కుడి చేతు దురద పెట్టడం వలన లక్కు కలిసి వస్తుంది అనుకుంటారు. కానీ శకున శాస్త్రం ప్రకారం స్త్రీలకు ఎడమ చేయి దురద పెట్టడం అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఇది చాలా శుభ సూచకం. ఏ స్త్రీకి అయితే ఎడమ చేయి దురద పెడుతుందో వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. నూతన ఉద్యోగంలో చేరే ఛాన్స్ ఉంది. ఇది విజయానికి సూచిక.

అలాగే స్త్రీలకు కుడి చేతిలో దురద పెట్టడం అస్సలే మంచిది కాదు, ఇది ఆర్థిక పరమైన నష్టాలను కలిగిస్తుంది. అంతే కాకుడా పనులు మధ్యలోనే ఆగిపోవడం, ఆర్థికపరమైన ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడం వంటిది జరుగుతుందని చెబుతున్నారు పండితులు.

పరుషులకు కుడి చేతిలో దురద పెట్టడం చాలా మంచిది. దీని వలన వీరికి ఆర్థికంగా కలిసి వస్తుంది. సమాజంలో మంచి గుర్తింపుల భిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. మంచి కంపెనీలో జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. వీరికి అన్ని విధాలుగా లాభాలు చేకూరుతాయి. ఒక వేళ ఎడమ చేతిలో దురద పెడితే ఇది తీవ్రమైన ఆర్థిక నష్టానికి కారణం అవుతుందంట.

నమ్మకాల ప్రకారం, ఒక స్త్రీకి ఎడమ అరచేయి దురద పెడితే, ఆ రోజున ఆమె పెద్ద ఖర్చులు చేయడం, ఇతరులకు డబ్బు అప్పుగా ఇవ్వడం వంటివి మానుకోవాలని చెబుతుంటారు నిపుణులు. నోట్ : పై సమాచారం శాస్త్రీయపరమైన నిరూపణ లేదు. ఇది కేవలం పండితులు ఇంటర్నెట్ సమాచారం మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.





