ఐటీ ఉద్యోగుల నయా ట్రెండ్‌.. వర్క్ ఫ్రమ్ పార్క్

కరోనా మహమ్మారి తర్వాత ఉద్యోగ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ‘వర్క్ ఫ్రమ్ హోమ్’, ‘హైబ్రిడ్ మోడ్’ వంటి పదాలు ఐటీ ప్రపంచంలో సర్వసాధారణంగా మారిపోయాయి. అయితే ఇప్పుడు వీటన్నింటికీ భిన్నంగా ‘వర్క్ ఫ్రమ్ పార్క్’ అనే కొత్త ట్రెండ్ మొదలైంది. ఉద్యోగులు కాంక్రీట్ భవనాలు, నాలుగు గోడల మధ్యే పరిమితం కాకుండా ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా పనిచేసుకునేందుకు దుబాయ్ మున్సిపాలిటీ ఈ సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. యూఏఈలోని అల్ బర్షా పాండ్ పార్క్‌లో ఈ వినూత్న వర్క్‌స్పేస్ హబ్‌ను ప్రారంభించారు. ఫ్రీలాన్సర్లు, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌, ఇంకా హైబ్రిడ్ విధానంలో పనిచేసే ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని దీనిని రూపకల్పన చేశారు. పార్క్‌లో కూర్చొని హాయిగా లాప్‌టాప్‌లో పనిచేసుకోవడానికి వీలుగా ఉచిత వైఫై, పవర్ సాకెట్లను అందుబాటులో ఉంచారు. ఒకవేళ బయటి వేడి లేదా గాలి తగలకుండా ఏసీ వాతావరణం కావాలనుకునే వారి కోసం పార్క్‌లోనే ప్రత్యేకంగా ఇండోర్ కేబిన్ సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఇండోర్ సదుపాయాలు కావాలనుకునే వారు రోజుకు 50 దిర్హమ్‌లు అంటే సుమారు రూ.1,300 చెల్లించి పాస్ తీసుకోవాల్సి ఉంటుంది. మామూలుగా పార్క్‌లో ఓపెన్ స్పేస్‌లో కూర్చుని పనిచేసుకునే వారు ఎలాంటి రుసుము చెల్లించనవసరం లేదు. దుబాయ్ మున్సిపాలిటీ, ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ ప్లాట్‌ఫామ్ ‘లెట్స్ వర్క్’ మరియు నిర్మాణ సంస్థ ‘అమనా’ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను అందుబాటులోకి తెచ్చాయి. దుబాయ్‌లోనే తొలిసారిగా ప్రారంభమైన ఈ ‘వర్క్ ఫ్రమ్ పార్క్’ సేవలు నవంబరు 2, సోమవారం నుంచే ఉద్యోగులకు అందుబాటులోకి వచ్చాయి. ప్రకృతికి దగ్గరగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో పనిచేయడం వల్ల ఉద్యోగుల ఒత్తిడి తగ్గి ఉత్పాదకత పెరుగుతుందని భావిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది? రేణుదేశాయ్‌ కామెంట్స్‌ వైరల్‌

తెరపై నటులు.. కానీ నిజ జీవితంలో దొంగలు

కీరవాణి ఇంట పెళ్లి సందడి షురూ.. శుభకార్యం వచ్చే నెలలోనే..

నాకు తెలిసిన అతను స్వార్థపరుడు.. ముఖేష్‌ ఆటపై జగతి షాకింగ్ రివ్యూ..

సౌత్ హీరోయిన్లు అంటే చిన్నచూపా.. మీరేమన్నా తోపులా..