భర్తకు తగ్గ భార్య.. ఏకంగా సూర్యకే 3 సార్లు నో చెప్పిందట!

నజ్రియా..! చబ్బీగా.. క్యూట్‌గా.. ఉండే ఈ హీరోయిన్.. యాక్టింగ్‌తోనూ అందర్నీ ఫిదా చేస్తుంటారు. కానీ సినిమా సెలక్షన్స్‌లో మాత్రం.. ఆచితూచి అడుగులేస్తుంటారు. స్టోరీ నచ్చకపోయినా.. పరిస్థితులు అనుకూలించకపోయినా.. స్టార్ హీరోల సినిమాలను కూడా పక్కన పెట్టేస్తుంటారు. అచ్చం తన భర్త ఫహాద్ లాగే.. చాలా నింపాదిగా.. చాలా సెలక్టివ్‌గా సినిమా స్టోరీలను సెలక్ట్ చేసుకుంటారు. అలా హీరో సూర్య సినిమానే మూడు సార్లు పక్కన పెట్టారట నజ్రియా.! ఇదే విషయాన్ని సీన్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్వయంగా సూర్యనే బయటపెట్టారు. కనీసం నాలుగో సారి అయినా నో చెప్పకుండా నా సినిమాను యాక్సెప్ట్ చేశావంటూ నజ్రియాను నవ్వించేశారు సూర్య. అంతేకాదు గత 12 ఏళ్లలో పలు తమిళ చిత్రాల్లో నటించే అవకాశాలు వచ్చినప్పటికీ నజ్రియా అంగీకరించలేదని.. అవకాశాలను కోల్పోయినట్లుగా కూడా నజ్రియా భావించలేదని.. నచ్చిన కథలను ఎంచుకునే విషయంలో ఆమె చూపించే ఆత్మవిశ్వాసం అభినందనీయం అంటూ సూర్య ఈ హీరో యిన్‌ను మెచ్చుకున్నారు. ఇక సూర్య కామెంట్స్‌ పై నజ్రియా కూడా రియాక్టవుతూ ఆన్సర్ ఇచ్చారు. 12 ఏళ్ల తర్వాత తమిళ సినిమాల్లోకి తిరిగి రావడానికి మెయిన్‌ రీజన్‌.. సూర్య సారే అంటూ ఆమె చెప్పుకొచ్చారు. గతంలో ఒకట్రెండుసార్లు వివిధ కారణాలతో ఆయనతో కలిసి నటించే అవకాశాలను తాను తిరస్కరించానని.. ఇప్పుడు ఆయనతో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందంటూ నజ్రియా చెప్పుకొచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మహేష్‌కు పాట పాడడమే.. నా జీవితంలో అతిపెద్ద తప్పు!

నా కడపు నిండుతోంది కేసీఆర్‌ సార్‌ వల్లే.. జబర్దస్త్‌ కమెడియన్ ఎమోషనల్

కెరీర్ ఇచ్చిన ఇండస్ట్రీ మీద నిందలు వేస్తావా.. రాధికకు పాయల్ స్ట్రాంగ్ కౌంటర్