
దక్షిణ భారతదేశంలో రైల్వే మౌలిక సదుపాయాలు, నగరాల మధ్య అనుసంధానంలో త్వరలోనే సరికొత్త విప్లవం రాబోతోంది. ఐటీ, వ్యాపార రాజధానులైన బెంగళూరును.. చెన్నై, హైదరాబాద్‌లతో అనుసంధానించే రెండు ప్రతిష్టాత్మక హై-స్పీడ్ రైలు కారిడార్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారు. నవంబర్ 1, ఆదివారం నాడు ముంబై-బెంగళూరు వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించిన సందర్భంగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ కొత్త కారిడార్ల వివరాలను అధికారికంగా వెల్లడించారు. ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం గంటల్లోకి పడిపోనుంది. ఈ బుల్లెట్ ట్రైన్ రాకతో బెంగళూరు –చెన్నై నగరాల మధ్య ప్రయాణ సమయం కేవలం 73 నిమిషాలకు తగ్గిపోతుంది. అలాగే బెంగళూరు–హైదరాబాద్ మధ్య ప్రయాణ సమయం కేవలం 2 గంటల 10 నిమిషాలకు తగ్గిపోతుంది. చెన్నైలోని ఆటోమొబైల్, తయారీ రంగాలు, బెంగళూరులోని గ్లోబల్ టెక్నాలజీ, కార్పొరేట్ రంగాలు ఈ వేగవంతమైన కనెక్టివిటీతో మరింత చేరువకానున్నాయి. అలాగే ఐటీ, వ్యాపార, స్టార్టప్ వ్యవస్థలలో అగ్రగామిగా ఉన్న హైదరాబాద్-బెంగళూరు నగరాల మధ్య కేవలం రెండు గంటల్లోనే ప్రయాణించే వెసులుబాటు కలగడం వల్ల తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య ఆర్థిక, వ్యాపార సంబంధాలు మరింత బలపడనున్నాయి. దేశవ్యాప్తంగా ప్రయాణ కాలాన్ని తగ్గించేందుకు 2026-27 కేంద్ర బడ్జెట్లో మొత్తం ఏడు హై-స్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించారు. అందులో చెన్నై – హైదరాబాద్ మధ్య ప్రయాణ సమయం సుమారు 2 గంటల 55 నిమిషాలగా అంచనా వేశారు. అలాగే పుణె –హైదరాబాద్ మధ్య సుమారు 1 గంట 55 నిమిషాలు, ముంబై -పుణె మధ్య ప్రయాణ సమయం కేవలం 48 నిమిషాలు, ఢిల్లీ – వారణాసి సుమారు 3 గంటల 50 నిమిషాలు, వారణాసి – పాట్నా – సిలిగురి మద్య ప్రయాణ సమయాన్ని సుమారు 2 గంటల 55 నిమిషాలుగా అంచనా వేశారు. మరోవైపు, భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ అయిన 508 కిలోమీటర్ల ‘ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు కారిడార్’ పనులు ఇప్పటికే శరవేగంగా జరుగుతున్నాయి. సుమారు రూ. 1.08 లక్షల కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో మహారాష్ట్రలో 4, గుజరాత్లో 8 కలిపి మొత్తం 12 స్టేషన్లు ప్లాన్ చేశారు. ఈ కారిడార్లన్నీ పూర్తయితే దేశ ఆర్థిక వృద్ధి మరింత వేగవంతం కావడం ఖాయం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఐటీ ఉద్యోగుల నయా ట్రెండ్.. వర్క్ ఫ్రమ్ పార్క్
నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది? రేణుదేశాయ్ కామెంట్స్ వైరల్
తెరపై నటులు.. కానీ నిజ జీవితంలో దొంగలు
కీరవాణి ఇంట పెళ్లి సందడి షురూ.. శుభకార్యం వచ్చే నెలలోనే..
నాకు తెలిసిన అతను స్వార్థపరుడు.. ముఖేష్ ఆటపై జగతి షాకింగ్ రివ్యూ..
