
దివంగత నటుడు ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన ప్రేమకథా చిత్రం ‘నువ్వు నేను’. అప్పటికే చిత్రం సినిమాతో యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ కు ఈ మూవీ మరో మంచి విజయాన్ని అందించింది. అతని కెరీర్ లో మరుపురాని చిత్రంగా మిగిలిపోయింది. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ ప్రేమ కథా చిత్రంలో ఉదయ్ కిరణ్ కు జోడిగా అనిత నటించింది. సునీల్, బెనర్జీ, తనికెళ్ల భరణి , ధర్మవరపు సుబ్రమణ్యం అలాగే తెలంగాణ శకుంతల సహాయక పాత్రలు పోషించారు. 2001న ఆగస్ట్ 10న విడుదలైన ఈ సినిమా అప్పటి యువతను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులోని పాటలు అయితే చార్ట్ బస్ట్ ర్స్ గా నిలిచాయి. అలాగే హీరో ఉదయ్ కిరణ్ కు లవర్ బాయ్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం చాలా మందికి తెలియదు. అదేంటంటే.. ఈ సినిమాకు హీరోగా ఉదయ్ కిరణ్ ఫస్ట్ ఛాయిస్ కాదట. వేరే హీరో వద్దన్న తర్వాతే ఈ మూవీ ఉదయ్ కిరణ్ దగ్గరకు వచ్చిందట. ఈ విషయాన్ని దర్శకుడు తేజనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో బయట పెట్టారు.
‘ ఉదయ్ కిరణ్ అమాయకుడు.. మంచివ్యక్తి అని.. ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండేవాడు. ఉదయ్ కిరణ్ తో నేను తీసిన మొదటి సినిమా ‘చిత్రం’. ఈ సినిమాను కేవలం 30 రోజుల్లోనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అనుకున్నట్లుగానే సరిగ్గా 31 రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేశాం. ఆ తర్వాత నువ్వునేను సినిమాను తీద్దామనుకున్నాం. అయితే మొదట ఈ సినిమాను మాధవన్ తో తీద్దామనుకున్నాం. అయితే కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. దీంతో ఆయన స్థాయంలో ఉదయ్ కిరణ్ ను తీసుకున్నాం’ అని తేజ చెప్పుకొచ్చారు. కాగా అంతకు ముందు చిత్రం సినిమా సమయంలో కూడా సేమ్ టు సేమ్ ఇలాగే జరిగిందట. ఈ చిత్రంలో హీరో ఫ్రెండ్‌గా చేయాల్సిన ఉదయ్ కిరణ్ కొన్ని పరిస్థితుల కారణంగా సడన్‌గా సినిమాలో హీరో అయిపోయాడు. నువ్వు నేను సమయంలో కూడా ఇదే జరిగింది. మాధవన్ నో చెప్పేసరికి ఉదయ్ కిరణ్‌ను హీరో చేసేశారట తేజ. అలా నువ్వు నేను సినిమా పట్టాలెక్కి ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీగా నిలిచిపోయింది.
మాధవన్ లేటెస్ట్ ఫొటోస్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





