
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో ప్రియాంక సింగ్ అలియాస్ పింకీ ఒకరు. అంతకు ముందు ‘జబర్దస్త్’ షోతో పాటు పలు టీవీ షోల్లో సాయి తేజగా లేడీ గెటప్స్ వేసి ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించిన అతను లింగ మార్పిడి సర్జరీ చేయించుకున్నాడు. ఆపరేషన్ తర్వాత ప్రియాంక సింగ్ గా మారిపోయి పలు టీవీ షోల్లో సందడి చేసింది. ఇదే క్రమంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో కంటెస్టెంట్గా అడుగుపెట్టింది. టైటిల్ గెలవకపోయినా తన దైన ఆట, మాట తీరుతో బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువైంది. ప్రస్తుతం పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ లో సందడి చేస్తోంది ప్రియాంక సింగ్. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన విషయాలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తుంటుంది. అయితే తాజాగా కన్నీటి పర్యంతం అవుతూ ఆమె షేర్ చేసిన ఒక ఎమోషనల్ పోస్టు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అందులో ఇలా రాసుకొచ్చింది ప్రియాంక.. ‘ఈరోజు నేను నా ప్రియమైన స్నేహితుడిని కోల్పోయాను. నిజం చెప్పాలంటే ఈ హృదయ విధారకర వార్తను ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. మీరు ఇకపై మాతో ఉండరు అనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. భగవంతుడా.. సాధ్యమైతే దయచేసి నా స్నేహితుడిని తిరిగి పంపండి. మేము సృష్టించుకోవాల్సిన కలలు , జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి’
‘వంశీ గారు .. మీరు నాకు ఎప్పుడూ కూడా ఒక ఫ్రెండ్ గా కంటే కూడా సొంత అన్నయ్యలా ఉండేవారు. మనం పంచుకున్న బంధం ఎప్పటికీ నా మనసుకు దగ్గరగా ఉంటుంది. ఇక మీరు లేరన్న బాధను వ్యక్తపరచడానికి కూడా నా దగ్గర మాటలు లేవు. మేము మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నామో.. మాటల్లో చెప్పలేనంతగా మిస్ అవుతున్నాం.. మనం మళ్లీ కలిసే వరకు మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. నువ్వు మా కళ్ల ముందు నుంచి దూరమైనా.. మా హృదయాల నుండి ఎప్పటికీ దూరం కాలేరు’ అని తన ఆవేదనకు అక్షర రూపమిచ్చింది ప్రియాంక.
ప్రియాంక సింగ్ షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్..
సోదర సమానుడైన స్నేహితుడిని కోల్పోయానంటూ ప్రియాంక సింగ్ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు అతనికి ఏమైంది? అని అడుగు తున్నారు. అయితే తన స్నేహితుడు ఎలా చనిపోయాడన్న విషయంపై క్లారిటీ ఇవ్వలేదు ప్రియాంక.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





