
అందం అభినయం ఉన్నా కూడా.. ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోతున్న హీరోయిన్లు మనదగ్గర చాలా మంది ఉన్నారు. వారిలో రెజీనా కాసాండ్రా కూడా ఒకరు. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. తెలుగు మాత్రమే కాకుండా తమిళం, హిందీ చిత్రాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఎక్కడా స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకోలేపోయారు. దీంతో ప్రస్తుతం రెజీనా.. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ఆచితూచి ముందుకు సాగుతున్నారు. నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న మహాశక్తి సినిమాలో రెజీనా నెగిటివ్ రోల్ లో నటించారు. ఇప్పుడా సినిమా థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకుంది. ఇక ఈ విషయాలు పక్కకు పెడితే.. ప్రస్తుతం రాధికా ఆప్టే సౌత్ మేకర్స్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతుండగా.. రెజీనా నార్త్ మేకర్స్ తీరుపై.. అందులోనూ బాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ కంపెనీ థర్మ ప్రొడక్షన్స్ తీరుపై సీరియస్ అయ్యారు. బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ ధర్మ ప్రొడక్షన్స్ పై రెజీనా షాకింగ్ కామెంట్స్ చేసింది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన కేసరి చాప్టర్ 2: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్‌వాలా బాగ్ లో తాను హీరో భార్యగా నటించానని ఆ పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉంటుందని రెజీనా చెప్పుకొచ్చారు. అయినప్పటికీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో తనను కావాలనే పక్కన పెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా ప్రమోషన్ల నుంచి ఏ కారణం చెప్పకుండా తన పేరును పూర్తిగా తొలగించారన్నారు. అలాగే తనపై అక్షయ్ కుమార్‌పై షూట్ చేసిన స్పెషల్ సాంగ్‌ను రిలీజ్ చేసినప్పటికీ.. సోషల్ మీడియాలో ఎక్కడ కుడా తనను ట్యాగ్ చేయలేదని బాధపడ్డారు. తన పేరు పెట్టలేదు. దీన్ని నేను ఏమని భావించాలి?. నేను దక్షిణాది నటిని అయినందుకే ఈ వివక్షా.? నార్త్ హీరోయిన్స్ తమ ఒపీనియన్ చెప్తే ప్రొఫెషనల్ అంటూ తెగ పొగిడేస్తారు. అదే సౌత్ యాక్టర్లు ప్రశ్నిస్తే పొగరుబోతులుగా ముద్ర వేస్తారు.. సౌత్ సినిమాను చిన్నచూపు చూస్తూ నార్త్ యాక్టర్స్ మాట్లాడే తీరు కరెక్ట్ కాదు అని రెజీనా అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ స్టార్ హీరో చేసిన చెడ్డ అలవాటు.. ఈ నటుడినే బలితీసుకుంది!
భర్తకు తగ్గ భార్య.. ఏకంగా సూర్యకే 3 సార్లు నో చెప్పిందట!
మహేష్‌కు పాట పాడడమే.. నా జీవితంలో అతిపెద్ద తప్పు!
నా కడపు నిండుతోంది కేసీఆర్ సార్ వల్లే.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్
కెరీర్ ఇచ్చిన ఇండస్ట్రీ మీద నిందలు వేస్తావా.. రాధికకు పాయల్ స్ట్రాంగ్ కౌంటర్
