Sai Durgha Tej: ఒకే ఒక్క మాటతో.. కాబోయే భార్యకు సాయి దుర్గతేజ్ ప్రేమ లేఖ.. మెగా హీరో పోస్ట్ వైరల్

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, హీరో సాయిదుర్గా తేజ్‌ త్వరలోనే ఓ ఇంటివాడు కానున్నాడు. కిరణ్మయి అనే అమ్మాయితో కలిసి పెళ్లిపీటలెక్కనున్నాడు. నవంబర్ 05న వీరి నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది. హైదరాబాద్‌లోని హిల్టన్‌ హైదరాబాద్‌ జీనోమ్‌ వ్యాలీ రిసార్ట్‌ వేదికగా జరిగిన ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, కొణిదెల, అల్లు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు భారీగా హాజరయ్యారు. . మెగాస్టార్‌ చిరంజీవి, సురేఖ కొణిదెల, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, స్నేహారెడ్డి, అల్లు బాబీ, నీలా షా, వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి, వారి కుమారుడు వాయువ్‌ తేజ్‌, నిహారిక, వైష్ణవ్ తేజ్,అల్లు శిరీష్.. ఇలా చాలా మంది ఈ వేడుకలో పాల్గొన్నారు. కాబోయే వధూవరులను మనసారా ఆశీర్వదించారు. సాయి దుర్గ తేజ్ ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కాబోయే జంటకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇదిలా ఉంటే ఎంగేజ్మెంట్ వేడుక తర్వాత సాయి దుర్గతేజ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. తనకు కాబోయే భార్య కిరణ్మయితో కలిసి దిగిన ఫొటోను పంచుకుంటూ.. ‘ ఐ లవ్‌ యూ’ అని క్రేజీ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. సహజంగానే ఇంట్రోవర్ట్ అయిన సాయి దుర్గ తేజ్ తనకు కాబోయే భార్యను ఇలా సింపుల్ గా పరిచయం చేశాడంటూ ఫ్యాన్స్ విషెస్ చెబుతున్నారు.

సాయి దుర్గ తేజ్ పోస్ట్..

కిరణ్మయి ఎవరంటే?

కాగా సాయి దుర్గా తేజ్ కాబోయే భార్య కిరణ్ గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. కిరణ్మయి- సాయి చిన్ననాటి స్నేహితురాలని, చాలాకాలంగా వీరిద్దరికీ పరిచయం ఉందని సమాచారం. ఈ స్నేహమే ప్రేమగా మారిందని, ఇప్పుడు మూడు ముళ్ల బంధంగా మారనుందని తెలుస్తోంది. అయితే కిరణ్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, చదువు, వృత్తి తదితర విషయాలు తెలియాల్సి ఉంది. ఇక సాయి దుర్గతేజ్ పెళ్లి డేట్‌ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్‌ 10న హైదరాబాద్‌లో‍ వీరి వివాహం జరగనుంది. ఈ వేడుకకి మెగా ఫ్యామిలీతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి